Connect with us

Movie News

వీళ్లను చూస్తే మీరు అస్సలు గుర్తుపట్టరు

Published

on

ఒకప్పుడు టాలీవుడ్ తెరమీద తళుక్కున మెరిసి … మాయమైన ఈ అందాల భామలు
ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?

వాళ్లంతా ఒకప్పుడు టాలీవుడ్ లో తళుక్కున మెరిసిన అందాల తారలు. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు. అందం , అభినయం కలబోసిన ఆ ముద్దు మందారాలు .. చేసినవి అతి తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేసారు. కెరీర్ లో మంచి హిట్స్ పడిన తరుణంలోనే ఏం జరిగిందో కానీ, సినీ జీవితానికి గుడ్ బై చెప్పేసి, వేరే రూట్లో పయనిస్తున్నారు. మరి వీళ్లంతా ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఎక్కడుంటున్నారో ఏం చేస్తున్నారో అనే ఆతృత అందరికీ ఉండడం సహజం.

Advertisement

ముందు గా ఈ లిస్ట్ లో ఉన్న అందాల తార అపర్ణ. నైంటీస్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సుందర కాండ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేసిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ ముద్దు గుమ్మ, ఈ సినిమా తర్వాత అక్కపెత్తనం చెల్లెలి కాపురం అనే ఒక్క సినిమా మాత్రమే చేసి తెలుగు తెరకు టాటా చెప్పేసింది. బెంగళూర్ కు చెందిన అపర్ణ ఈ సినిమా తర్వాత హిందీలో నాక్ అవుట్ అనే సినిమాలో మాత్రమే నటించి,2002 లోనే యు.ఎస్ శాన్ ఫ్రాన్సిస్కో లో సెటిల్ అయిపోయింది. చక్కటి భర్త, ముద్దులొలికే ఇద్దరు పిల్లలతో అపర్ణ అక్కడే హ్యాపీగా ఉంటున్నారు.

ఇక అతి తక్కువ సినిమాలతో ఇండియన్ స్ర్కీన్ మీద కనిపించి మాయమైన మరో అందాల హీరోయిన్ గిరిజ. తండ్రి కర్ణాటకకు చెందిన వైద్యుడు, తల్లి ఇంగ్లాండుకు చెందిన వ్యాపారవనిత. ఇంగ్లాండులో పుట్టి పెరిగిన ఈమె 18 యేళ్ల వయసులో దక్షిణ భారత శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడానికి భారతదేశానికి వచ్చింది. భారతదేశముపై మమకారముతో హిందూ తత్త్వము మరియు మతముపై విస్తృతముగా పరిశోధన చేసింది. 1998లో ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళి భారతీయ మతాలపై ఎం.ఏ కోర్సు పూర్తిచేసి, అరబిందో తత్త్వముపై డాక్టరేటు పరిశోధన చేసింది.

1989లో మణిరత్నం గీతాంజలితో సౌత్ స్ర్కీన్ మీద మెరిసింది. ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ తో ఆమె ఆ తర్వాత కాలంలో పెద్ద హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారు అందరూ. కానీ ఆమె వందనం అనే ఒక మలయాళ సినిమాలోనూ, హృదయాంజలి అనే మరో తెలుగు సినిమాలో మాత్రమే నటించగలిగింది. గిరిజ ప్రస్తుతం రచయితగా లండన్లో స్థిరపడింది. ఈమె నటనపై ఇప్పటికీ తన అధ్యయనము కొనసాగిస్తూ ఇతర నటులు మరియు సినీ నిర్మాతలతో పనిచేస్తూనే ఉంది. 2005 నుండి లండన్ లో ఆరోగ్య సంబంధ విషయాల విలేఖరిగా పనిచేస్తున్నది. ప్రస్తుతం గిరిజ అక్కడే ఉంటోంది.

Advertisement

తెలుగు తెరమీద అతి తక్కువ సినిమాల్లో నటించిన మరో అందాల తార మీనాక్షి శేషాద్రి. పెయింటర్ బాబు అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రి ఇచ్చిన మీనాక్షి.. అతి తక్కువ టైమ్ లోనే నెం. 1 హీరోయిన్ అయింది. బాలీవుడ్ బడా హీరోల సరసన నటించి, మెప్పించిన మీనాక్షి కి తెలుగు లో బాగా క్రేజీ తెచ్చిపెట్టిన చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర. యన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటైమ్ లో తెరకెక్కించిన ఈ సినిమాలో మీనాక్షి మేనకగా అదరగొట్టేసింది.అంతకన్నా ముందు జీవనపోరాటం సినిమాలో కేమియో రోల్ పోషించింది. ఆ తర్వాత విశ్వనాథ్ , చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఆపద్బాంధవుడు లో మెరిసింది. 1998 వరుకూ మీనాక్షి బాలీవుడ్ తెరమీద లెక్కకు మించిన చిత్రాల్లో నటించి, చాలా ఏళ్లకు మళ్లీ 2016 లో సన్నిడియోల్ తో ఘాయల్ వన్స్ ఎగైన్ లో గెస్ట్ పాత్రలో కనిపించింది. ప్రస్తుతం మీనాక్షి శేషాద్రి, యూ.ఎస్. లో సెటిలైంది. అక్కడ చెరిష్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్ అనే డ్యాన్స్ స్కూల్ రన్ చేస్తోంది. భర్త హరీష్, కేంద్ర, జోష్ , మ్యాట్ ఆమె పిల్లలు.

భద్రాచలం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి సింధు మీనన్ కూడా ఇప్పుడు సినిమాలు వదిలేసి దాంపత్యజీవితంలోకి అడుగుపెట్టేసింది. రష్మి అనే కన్నడ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన సింధు మీనన్ ఆ తర్వాత లెక్కకు మించిన సినిమాలతో సౌత్ స్ర్కీన్ మీద మంచి పేరు తెచ్చుకుంది. త్రినేత్రం, శ్రీరామచంద్రలు, ఆడంతే అదో టైపు, ఇన్స్ పెక్టర్ అనే సినిమాలు చేసినా కృష్ణవంశీ చందమామ అమ్మడికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. 2010 ఏప్రిల్ లో డామ్నిక్ ప్రభు అనే ఒక వ్యాపార వేత్తను పెళ్లిచేసుకొని యూ.ఎస్ లో సెటిల్ అయింది. ఆమెకు స్వెట్లానా అనే ఒక అమ్మాయి. సింధు మీనన్ ఆఖరి తెలుగు సినిమా సుభద్ర. సో.. అలా ఈ నలుగురు అందగత్తెలు .. మెరుపు తీగల్లా మెరిసి టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసారు.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!