సౌందర్య నాన్న ఎవరో తెలుసా? తన సొంతూరు ఏది? డాక్టర్ కావాలనుకున్న సౌందర్య యాక్టర్ ఎలా అయ్యారు?

0
825

సౌందర్య.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. భారత సినిమా ఇండస్ట్రీలోనే సౌందర్య లాంటి మరో హీరోయిన్ రాలేదు.. ఇక మున్ముందు కూడా రాదు. సౌందర్య అంటే ఒక ఆరాధన భావం. తనను చూస్తే మన ఇంట్లో మనిషిని చూసినట్టే అనిపిస్తుంది. తను సినిమాల్లో నటించదు. జీవిస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. కన్నడ సినిమా ఇండస్ట్రీలోనూ తన టాప్ హీరోయిన్ గా ఎదిగారు. అందరు స్టార్ హీరోలతో సినిమాలు తీసి.. అచ్చ తెలుగు పదహారణాల అమ్మాయి అంటే సౌందర్యలా ఉండాలని అందరూ చెబుతుండేవారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే సౌందర్యలా ఉండాలని కూడా అనేవారు. సౌందర్య సొంతూరు బెంగళూరు. చిన్నప్పటి నుంచి తను బెంగళూరులోనే ఉన్నారు. అక్కడే పుట్టి పెరిగారు. చదువు కూడా బెంగళూరులోనే సాగింది.

దురదృష్టవశాత్తు సౌందర్య ప్రస్తుతం మన దగ్గర లేకున్నా.. తన మెమోరీస్ మాత్రం మనతోనే ఉన్నాయి. ఇప్పటికీ తన సినిమాలు చూస్తే.. తను చనిపోయింది.. ఈలోకంలో లేదు.. అనే విషయం కూడా గుర్తుకురాదు. చాలామందికి సౌందర్య వ్యక్తిగత విషయాలు తెలియదు. తను ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? తన సొంతూరు ఏది? తన నాన్న ఏం చేసేవారు? లాంటి విషయాలు చాలామందికి తెలియదు. అయితే.. తను చనిపోవడానికి ముందు.. మీడియాకు ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మా నాన్న కన్నడ ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్

సౌందర్య నాన్న పేరు కేఎస్ సత్యనారాయణ్. ఆయన కన్నడ ఇండస్ట్రీలోనే పెద్ద డైరెక్టర్. నిర్మాత, రచయిత కూడా. కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఆయన. చిన్నప్పటి నుంచి ఆయన్ను చూస్తూ పెరిగినా.. ఏనాడూ సౌందర్య సినిమాల్లోకి రావాలని అనుకోలేదట. తను చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని అనుకున్నారట. అయితే.. చిన్నప్పటి నుంచి తన నాన్నతో సినిమా షూటింగ్ లకు వెళ్లేవారు సౌందర్య. ఆ సమయంలోనే తనను చూసిన కొందరు డైరెక్టర్లు, నిర్మాతలు తనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగారు సౌందర్య.

సౌందర్య భర్త ఎవరో తెలుసా?

సౌందర్య భర్త తన రిలేటివే. తన బంధువులకు చెందిన అబ్బాయినే సౌందర్య పెళ్లి చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి తనకు పరిచయం ఉన్న వ్యక్తే. ఆయన సాఫ్ట్ వేర్ ఇంజినీర్. బెంగళూరులో ఆయనకు సాఫ్ట్ వేర్ కంపెనీ ఉందట. చిన్నప్పటి నుంచి ఇద్దరికీ పరిచయం ఉండట వల్ల.. పెద్దయ్యాక.. వాళ్ల మధ్య ప్రేమ చిగురించిందట. ఇద్దరూ కలిసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారట.

సౌందర్యకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం

చిన్నప్పటి నుంచి సౌందర్యకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే తను పెయింటింగ్ వేసేవారట. డ్రాయింగ్ క్లాసెస్ కు వెళ్లి మరీ.. తను నేర్చుకున్నారట. తనకు కలర్స్ చూస్తే ఒక మంచి ఫీల్ వస్తుందట. డిఫరెంట్ పెయింటింగ్ ఆర్ట్స్ నేర్చుకోవాలని తనకు ఎంతో కోరికగా ఉండేదట.

సౌందర్య రాజకీయాల్లో కూడా రాణించాలనుకున్నారు. అంటే దేశం కోసం ఏదైనా చేయాలనుకున్నారు. దాని కోసం రాజకీయాల్లో చేరి దేశానికి సేవ చేయాలని అనుకున్నారు. కానీ.. తను దేశానికి సేవ చేయకుండానే ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here