దూర ప్రయాణాలు చేసే బస్సు ప్రమాదాల బారిన పడుతున్న విషయం తెలిసిందే.. నత్యం ఎదో ఒక వార్త మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆయా యాక్సిడెంట్లకు వివిధ రకాల కారణాలు ఉన్నా.. అందులో కొన్ని డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి. అయితే అటువంటి వాటి నివారణపై తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ దృష్టిపెట్టింది. దీనికోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో చేయబడిన డివైజ్‌ను వినియోగించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఈ పరికరం స్టీరింగ్‌కు ఏర్పాటు చేయడం వల్ల.. ఇది డ్రైవర్ కదలికలపై ‘కన్నే’సి ఉంచుతుంది. ఒకవేళ డ్రైవర్ నిద్రమత్తులోకి జారినా, అలసటతో ఎక్కువసేపు కన్నుమూసినా వెంటనే అప్రమత్తం చేస్తుంది. మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసీఈఎంఈ) ఈ ఆర్టిఫిషియల్ డివైజ్‌ను రూపొందిచారు. అయితే దీని తయారీ మరియూ పనితీరుపై ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఐటీ విభాగం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సమావేశంలో చర్చించారు.































