పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ప్రముఖ టీవీ నటి కీర్తి ధునుష్. ఈ ఆనందకరమైన విషయాన్ని స్వయంగా ఆమె భర్త, టీవీ నటుడు ధనుష్ సోషల్ మీడియా హండిల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ చిన్నారికి పుట్టీపుట్టగానే రుద్వేద్ అనే పేరు పెట్టేసారు కీర్తి ధనుష్ దంపతులు. తొలిసారి తల్లిదండ్రులు అయిన కీర్తి – ధనుష్ జంటకు బుల్లితెర సహచర నటులుతో పాటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక ఇటీవలే బుల్లితెర నటి కీర్తి సీమంతం జరిగింది. ఈ ఆ సమయంలో సీమంతం ఫోటోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి కీర్తి బావ నిరుపమ్ (డాక్టర్‌బాబు) కూడా హాజరయ్యారు. నటి కీర్తి నిరుపమ్ పరిటాల భార్య మంజుల పరిటాల కు స్వయానా చెల్లెలు. దీంతో ఇరు కుటుంబాలు అనడంలో మునిగితెలుతున్నాయి..































