మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగిన రెజ్లంగ్ మ్యాచ్ వీడియో వైరల్ అయ్యింది.ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య కుస్తీ పోటీ ఇది.ఈ వీడియో అచ్చం.. దంగల్ సినిమా తరహాలో సాగింది ఇద్దరి మధ్యా పోటీ.ఈ తరహా మల్లయుద్ధం బహుశా ఇదే తొలిసారి అనుకోవచ్చు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఓ గ్రామంలో ఈ మల్లయుద్ధ పోటీ మరాఠాల సాంస్కృతికోత్సవాల సందర్భంగా నిర్వహించారు..ఈ పోటీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.అప్పటికే ఇద్దర్ని ఓడించిన మల్లయోధుడిని.. ఓ అమ్మాయి మట్టి కరిపించింది.



























