71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ప్రతి సంవత్సరం అర్హులైన వారికీ పద్మ పురస్కారాలు ప్రకటిసున్న కేంద్రం ఈ ఏడాది 2020వ సంవత్సరానికి గాను 141 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేయగా, ఇందులో ఏడుగురిని పద్మ విభూషణ్ వరించింది. మరో 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి.
పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలు :-
జార్జిఫెర్నాండెజ్ (మరణానంతరం)
అరుణ్ జైట్లీ (మరణానంతరం)
అనిరుద్ జగన్నాధ్ (మారిషస్)
మేరీకోమ్
చన్నూలాల్ మిశ్రా
సుష్మా స్వరాజ్ (మరణానంతరం)
విశ్వేష్టతీర్థ స్వామీజీ (ఉడిపి మఠం స్వామీజీకి మరణానంతరం)
పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికైనవారు :-
ముంతాజ్ అలీ
సయ్యద్ మౌజీమ్ అలీ (మరణానంతరం)
ముజఫర్ హుసేన్ బేగ్
అజయ్ చక్రవర్తి
మనోజ్ దాస్
బాలకృష్ణ దోషి
కృష్ణమ్మాల్ జగన్నాథన్
ఎస్‌సీ జామిర్
అనిల్ ప్రకాష్ జోషి
సెరింగ్ లాందోల్
ఆనంద్ మహీంద్రా (వ్యాపారవేత్త)
నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ (మరణానంతరం)
మనోహర్ పారికర్ (మరణానంతరం)
జగదీష్ సేథ్ (అమెరికా)
పీవీ సింధు (తెలంగాణ)
వేణు శ్రీనివాసన్
పద్మ శ్రీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖులు :-
ఏక్తా కపూర్ (సినీ పరిశ్రమ)
కంగనా రనౌత్ (సినీ పరిశ్రమ)
అద్నన్ సామి (సినీ పరిశ్రమ)
కరణ్ జోహార్ (సినీ పరిశ్రమ)































