పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల మధ్య ఉన్నాయి. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం పాపికొండల సొంతం. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతమంతా చల్లగా ఉంటుంది. గోదారి అలల మధ్య సాగే ఈ యాత్ర ప్రతిఒక్కరికీ గుర్తుండిపోతుంది.

అయితే దాదాపు 21 నెలల తర్వాత పాపికొండల విహార యాత్ర ప్రారంభమైంది. దేవీపట్నం మండలం పోచమ్మ గుడి వద్ద గోదావరికి మంత్రి అవంతి శ్రీనివాస్, అధికారులు, పండితులు హారతి ఇచ్చారు. పాపికొండల యాత్ర బోటును మంత్రి ప్రారంభించారు. 2019లో కచ్చులూరు బోటు ప్రమాద ఘటన తర్వాత విహార యాత్ర నిలిచిపోయిన సంగతి తెలిసిందే.






























