అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో భారత్‌లో పసిడి ధర పెరిగింది. గురువారం నాటి బులియన్ ట్రేడింగ్‌లో దేశ రాజధాని డిల్లీలో రూ.10గ్రాముల బంగారం ధర రూ.526 పెరిగి రూ.46,310కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ బలహీనపడటం కూడా పసిడి ధర పెరుగుదలకు కారణం అయివుడోచ్చని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.

ఇక బుధవారం 10గ్రాముల బంగారం రూ. రూ.45,784 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తుంది. ఇటీవల భారీగా తగ్గిన వెండి గురువారం రూ.1,231 పెరిగి, కిలో రూ.68,654కు చేరింది. అంతకుముందు కిలో రూ.67,423గా ఉన్న సంగతి తెలిసిందే.































