దర్శకుడు వై.నాగేశ్వరరావు 1989లో వెంకటేష్ రజిని హీరోహీరోయిన్లుగా ‘ధ్రువ నక్షత్రం’ చిత్రం రూపొందించి ఘన విజయాన్ని వెంకటేష్ కి అందించడం జరిగింది. ఆ తర్వాత శ్రీ బాలాజీ సినీ క్రియేషన్స్ సారధ్యంలో శ్రీనివాస్ వర్మ, మీనా హీరోహీరోయిన్లుగా ‘ప్రయత్నం’ అనే సినిమాను రూపొందించారు. ఆ సినిమా బాక్సాఫీస్ ముందు పరవాలేదు అనిపించింది. ఆ తర్వాత ‘ప్రయత్నం’ సినిమా నిర్మాత బాలాజీ ఒకరోజు దర్శకుడు వై నాగేశ్వరరావు ను కలవడం జరిగింది. అప్పుడు బాలాజీ విజయశాంతి తో ఒక సినిమాను రూపొందించాలనుకుంటున్నానని దర్శకుడు వై.నాగేశ్వరరావు తో చెప్పడం జరిగింది.

అప్పటికే ‘కర్తవ్యం’, ‘ఆశయం’ లాంటి లేడి ఓరియంటెడ్ సినిమాలతో లేడీ అమితాబ్ గా విజయశాంతి మంచి జోష్ లో ఉందని ఆమెకు తగిన కథతో సినిమాను రూపొందించాలనుకున్నారు. హీరో ఒక పోలీస్ అధికారి ఆయనకు ఓ పల్లెటూరి భార్య, ఇలా సినిమాకు ఒక మూల కథ అనుకుని దర్శకులు కథ సిద్ధం చేసుకున్నారు. ఆ క్రమంలో తరచూ హీరో సుమన్ కి పోలీస్ పాత్రలే రావడం వలన ఈ పోలీస్ పాత్ర బోర్ కొడుతుందని సుమన్ చెప్పడంతో వై నాగేశ్వరరావు జోక్యం చేసుకుని ఎన్ని పోలీస్ పాత్రలు వేసినప్పటికీ కథ మరియు పాత్రలో కొత్తదనం కనబడుతుందని ఒప్పించడం జరిగింది. ఆ తర్వాత వై నాగేశ్వరరావు, బాలాజీ, మాటల రచయిత తనికెళ్ల భరణి కలిసి హీరోయిన్ విజయశాంతి గ్రామీణ పాత్ర కావడంతో ఆమెకు ఎలాంటి స్లాంగ్ పెడదామని సందిగ్ధంలో ఉన్నారు. ఆ క్రమంలో ఆ పాత్రకు శ్రీకాకుళం స్లాంగ్ పెడదామని నిర్మాత సూచించడం జరిగింది. ఆ స్లాంగ్ కొంచెం సాగదీసినట్లు గా ఉంటుందని దర్శకుడు వై నాగేశ్వరరావు చెప్పారు.
విజయశాంతి పాత్ర స్వభావాన్ని ఆలోచించి వై నాగేశ్వరరావు తెలంగాణ స్లాంగ్ అయితే ఆ పాత్రకు కరెక్టుగా ఉంటుందని చెప్పడం జరిగింది. విజయశాంతి తెలియని అమాయకత్వపు పల్లెటూరి గృహిణి పాత్రలో ఒదిగిపోయారు. అలా ఆమె తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడడం విజయశాంతికి కి మరింత పేరు తీసుకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో విజయం సాధించడంతో బాలీవుడ్ లో శ్రీదేవి, అక్షయ్ కుమార్ తో ప్లాన్ చేయడం జరిగింది. కానీ 70 శాతం సినిమా పూర్తయిన తర్వాత ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అయితే ‘మొండి మొగుడు పెంకి పెళ్ళాం’ లో విజయశాంతి చేసిన పాత్ర హిందీలో శ్రీదేవి కి బదులు మాధురి దీక్షిత్ అయితే బాగుంటుందని తాను ఆ సినిమా నిర్మాతలకు చెప్పానని ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు వై.నాగేశ్వరరావు వివరించడం జరిగింది.
































