నాగార్జున అంటే మనకు మొదట గుర్తొచ్చేది మన్మధుడే.. 60 ఏళ్ల వయస్సులో కూడా నవ మన్మథుడిలానే ఉంటాడు కింగ్ నాగార్జున. ఇక ఇప్పటి యంగ్ హీరోలతో ఇప్పటికీ గ్లామర్ విషయంలో పోటీగా నిలిస్తుంటాడు. ఇప్పటికీ అయన అంటే అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇక అయన సినిమాల్లో ఇప్పటికీ ఏంతో ఎనర్జిటిగ్‌గా నటిస్తారు నాగార్జున. ఇక సినీ పరిశ్రమలో ఉన్న నటీనటులతో పాటూ తెలుగు ప్రేక్షకులకు కూడా అయన అందం రహస్యం ఏంటో ఇప్పటికీ మిస్టరీగానే మిలిగిపోయింది.

అయితే ఇదంతా గతం. ఇప్పుడు నాగార్జున పూర్తిగా మారిపోయాడు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అయన ఫోటో చూస్తె నిజమే అనిపిస్తుంది. పూర్తిగా నెరిసిన జుట్టు, మీసకట్టుతో కనిపించడం అభిమనులంతో పాటో అందరినీ షాక్కు గురిచేస్తుంది. మేకప్ లేకుండా నాగార్జున ఇలా ఉంటారా ? అనే సందేహం వ్యక్తమవుతుంది.































