దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్‌పై 30పైసలు పెరిగింది. చమురు సంస్థలు ధరలను సవరించడంతో.. డిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.98.81కి లభిస్తోంది. డీజిల్ రూ.89.13కి చేరింది. ఇదిలా ఉండగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, మణిపూర్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లో లీటర్ పెట్రోల్ ఇప్పటికే వంద మార్కును దాటింది.

ఇక రాజస్థాన్‌లో శ్రీగంగానగర్‌లో వంద మార్కు దాటిన పెట్రోల్‌ను ప్రస్తుతం రూ.110.04కి కొనుగోలు చేయాల్సి వస్తోంది. డీజిల్ ధర రూ.102.42గా ఉంది. ఆయా రాష్ట్రాల స్థానిక పన్నుల (వ్యాట్) ఆధారంగా ఈ ధరల్లో మార్పులుంటాయి.































