బుల్లితెరపై అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోతున్న రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ రియాలిటీ షో కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని భాషలలో ఎంతో విజయవంతంగా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం తెలుగులో కూడా నాలుగు సీజన్లలో దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఐదవ సీజన్ ప్రసారం చేయనుంది.

ఇప్పటికే ఐదవ సీజన్ ప్రసారం కావాల్సి ఉండగా.. కరోనా కారణం చేత వాయిదా పడుతోంది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో బిగ్ బాస్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఐదు నుంచి ప్రసారం చేయాలని నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ లని జూమ్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొనే కంటెస్టెంట్ లు వీళ్లే అంటూ.. కొందరు యూట్యూబర్స్, టిక్ టాక్, యాంకర్లు పేర్లు వినిపించాయి. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గతంలో ఏ సీజన్ లో లేని విధంగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఎక్కువ సంఖ్యలో కంటెస్టెంట్ లను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీజన్ ఫైవ్ లో ఏకంగా 18 మంది కంటెస్టెంట్ లు పాల్గొనగా వీరందరూ కూడా ప్రీమియర్ ఎపిసోడ్ తోనే హౌస్ లోకి ఎంటర్ అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఏ సీజన్లో కూడా ఇంత మంది కంటెస్టెంట్ అను ఒకేసారి పంపించలేదు. ఈ సీజన్ లో ఒకేసారి ఇంతమంది హౌస్ లోకి వెళ్లడంతో హౌస్ లో ఎలాంటి రచ్చ ఉంటుందో తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 5 వరకు వేచి ఉండాలని తెలుస్తోంది.































