చనిపోయి ఐదుగురి ప్రాణాలు కాపాడిన చిన్నారి.. ఎలా అంటే..?

0
91

ఆ పాప వయస్సు కేవలం 20 నెలలు. ఊహ కూడా ఆ పాపకు తెలిసీ తెలియని వయస్సు. ఇంత చిన్న వయస్సులో ఆ పాప ఏకంగా ఐదుగురి ప్రాణాలను కాపాడింది. పాప ఈ లోకానికి దూరమైనా ప్రాణదాతగా నిలిచి ఐదుగురి ప్రాణాలు నిలపడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని రోహిణి ఏరియాకు చెందిన ధ‌నిష్తా అనే చిన్నారి వయస్సు కేవలం 20 నెలలు. ఈ నెల 8వ తేదీన ధ‌నిష్తా ఆడుకుంటూ బాల్కనీ నుంచి కింద పడింది.

పాప బాల్కనీ నుంచి పడినట్టు గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై సమీపంలో ఉన్న గంగారామ్ ఆస్పత్రికి పాపను తీసుకెళ్లారు. అయితే వైద్యులు పరీక్షలు చేసి పాప బ్రెయిన్ డెడ్ అయినట్టు గుర్తించారు. 11వ తేదీన పాప పరిస్థితి విషమించడంతో పాటు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. విషయం తెలిసిన ధ‌నిష్తా తల్లిదండ్రులు చిన్నారి ప్రాణాలు కోల్పోయినా అశిశ్ కుమార్ అవయవాలను దానం చేయడం ద్వారా అవయవాలు అవసరం ఉన్నవాళ్ల ప్రాణాలను కాపాడాలని నిర్ణయం తీసుకున్నారు.

చిన్నారి తల్లిదండ్రులు బబితా, అశిష్ కుమార్ ఒకవైపు బాధను దిగమింగుకుంటూ వైద్యులకు చిన్నారి అవయవాలను దానం చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వైద్యులు పాప శరీర అవయవాల ద్వారా ఏకంగా ఐదుగురి ప్రాణాలను కాపాడారు. పాప కిడ్నీలు, గుండె, కాలేయం, కార్నియాలను దానం చేసినట్లు సమాచారం. పాప తండ్రి చిన్నారి అవయవాలను దానం చేయడం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

పాప తండ్రి అశిశ్ కుమార్ మాట్లాడుతూ తమ పాప చనిపోయినా ఐదుగురిలో బ్రతికే ఉందని వెల్లడించారు. అవయవాల కోసం చూస్తున్న కొందరిని తాము కలిసిన సమయంలో అవయవదానం చేయాలనిపించిందని అశిశ్ కుమార్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here