కొంతమంది ఉద్యోగం చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నా జీతం మాత్రం పెరగదు. ఇంక్రిమెంట్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతారు. దీంతో చాలీచాలని జీతాలతోనే కుటుంబాలను నెట్టకొచ్చేవారు ఉన్నారు. అయితే ఇక్కడ ఓ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులందరికీ ఆ కంపెనీలో పనిచేసే సీఈఓ జీతంలో 90 శాతం ఉద్యోగులకు పంచి ఇస్తున్నాడు.

ఇంతకు విషయం ఏంటంటే.. అమెరికాలోని గ్రావిటీ పేమెంట్స్ అనే ఓ ప్రైవేట్ క్రెడిట్ కార్డు ప్రాసెసింగ్ కంపెనీకి డ్యాన్ ప్రైస్ అనే వ్యక్తి సీఈవోగా పనిచేస్తున్నారు. ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతం కంటే సీఈఓ జీతం ఎక్కవు. అయితే చాలీచాలని జీతాలతో ఇబ్బందులకు గురవతున్న వారి కష్టాలను విన్నాడు.
ఇంకేముంది.. డ్యాన్ ప్రైస్ తనకు వచ్చే ఇంక్రిమెంట్‌తోపాటు తన జీతం నుంచి 90 శాతం వరకు కట్ చేసి ఆ మొత్తాన్ని తన కింద పనిచేస్తున్న 120 మంది ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల ఒక్కొక్కరి జీతం 74 వేల డాలర్లకు చేరుకుంది. ఇది కేవలం ఒక నెలో.. రెండు నెలలో కాదు..గత ఆరేళ్ల నుంచి ఇలాగే తన ఉద్యోగులకు పంచుతున్నాడు.
సీఈవో దాతృత్వానికి చలించిపోయిన ఉద్యోగులు కష్టపడి ఆ కంపెనీ లాభాలను ఆరేళ్లలోనే మూడు రెట్లు చేసి చూపించారు కూడా. నేను జీతాన్ని పంచాను వారు తన కంపెనీనీ ఉన్నత స్థానంలో నిలబెట్టారాని ఆనందం వ్యక్తం చేశారు సీఈఓ. బాస్ అంటే ఇలానే ఉండాలంటూ అందరూ అతడిని ప్రశంసిస్తున్నారు.































