మన భారతదేశంలో సినీ పరిశ్రమకు ఉన్నంత డిమాండ్ మరే ఇతర పరిశ్రమకు ఉండదు. వినోదం అనేది ప్రతీ ఒక్క మనిషి జీవితంలో ఓ భాగం అయిపోయింది. అందుకే దానికి ఎంత ఖర్చు అయినా పెట్టడానికి ఇష్టపడుతుంటారు. దానిలో భాగంగానే మొబైల్ లో డేటాను ఉపయోగించడం. సినిమాలను డౌన్ లోడ్ చేసుకొని మరీ చూడటం.

ఇవన్నీ వినోదానికి ఖర్చుపెట్టే డబ్బులే. ఇదిలా ఉండగా.. భారత్ లో ఒక భాషలో విడుదలైన సినిమా హిట్ అయిందంటూ.. మరో భాషలో దానిని అదే కథతో తెరకెక్కిస్తుంటారు. ఇలా రిమేక్ అయిన సినిమాలు చాలా వరకు బంపర్ హిట్ కూడా అయ్యాయి. అయితే అదే భాషలో ఒకే కథతో వచ్చి.. కథనం వేరే విధంగా ఉన్న సినిమాలు మన తెలుగులో చాలావరకు ఉన్నాయి.
యూత్ కు ఓ ట్రెంట్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమా కథ అప్పట్లో వచ్చిన దేవదాసులానే ఉంటుంది. మహేశ్ బాబు హీరోగా నటించి ఓ సంచలనం స్పష్టించిన సినిమా పోకిరి. ఈ సినిమా కథ కూడా అప్పట్లో స్టేట్ రౌడీతో పోలి ఉంటుంది. ఇంకా నితిన్ హీరోగా నటించిన సినిమా అఆ కూడా అప్పట్లో వచ్చిన ‘మీనా’ చిత్ర కథ సేమ్ ఉంటుంది.
ఇదంతా బాగానే ఉంది.. కానీ ఒకే కథను ఏకంగా 7 సార్లు తీశారట. అదేంటంటే.. 1979లో హిందీలో వచ్చిన కుడి గర్జ్ అనే మూవీని 1988లో కృష్ణంరాజు- శరత్ బాబులు ప్రధాన పాత్రల్లో ‘ప్రాణ స్నేహితులు’గా తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా దుమ్ము రేపింది. ఇదే సినిమాను తర్వాత తమిళంలో రిమేక్ చేశారు. తమిళంలో అన్నమలైగా తెరకెక్కించారు. ఇదే సినిమాను తెలుగులో కూడా డబ్ చేశారు. ఆ సమయంలో కూడా సూపర్ హిట్ అయింది. ఇలా ఒకే కథను 7 సార్లు తెరకెక్కించగా.. దాదాపు 5 సార్లు హిట్ అయింది.


































