తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.తన బాబాయ్ మరణించాడనే విషయం తెలియని ఓ చిన్నారి రాత్రంతా తన బాబాయ్ మృతదేహంపై నిద్రపోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన చూసిన పలువురు కంటతడి పెట్టిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

సిద్దిపేట జిల్లాలోని మర్కూక్ మండలం నర్సన్నపేటకి చెందిన ఎక్కలదేవి ఐలయ్య శనివారం రాత్రి 10 గంటల సమయంలో పని నిమిత్తం జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్‌లోని తన బావ వద్దకు బైక్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలోనే ఐలయ్య తనతోపాటు తన అన్న కొడుకు మోక్షిత్(4) ని కూడా వెంటబెట్టుకుని బయలుదేరాడు. మార్గమధ్యంలో రోడ్డుపై ధాన్యం కుప్పలు రాశిగా పోసి కప్పి ఉంచారు. చీకట్లో ధాన్యం కుప్పలు కనిపించకపోవడంతో ఐలయ్య బైక్ అదుపుతప్పి దాన్యం కుప్పను ఢీకొట్టడంతో బండి పైనుంచి చిన్నారి మోక్షిత్ ఐలయ్య ఎగిరి పడ్డారు.
ఈ క్రమంలో రోడ్డు పక్కన పడ్డ ఐలయ్య తలకి తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నారి మోక్షిత్ కి కూడా గాయాలయ్యాయి. చుట్టూ చీకటిగా ఉండడంతో అటు వైపు ఎవరూ రాలేదు. తన బాబాయి చనిపోయాడనే విషయం తెలియక చిన్నారి రాత్రంతా తన బాబాయి మృతదేహంపై పడుకొని నిద్ర పోయాడు.
తెల్లవారగానే పొలం పనుల నిమిత్తం అటువైపుగా వెళ్లిన స్థానికులకి ఈ దృశ్యం కనిపించడంతో వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులందరూ సంఘటన స్థలానికి చేరుకునే సమయానికి చిన్నారి తన బాబాయ్ మృతదేహంపై పడుకొని కనిపించాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తరువాత మృతుడి కుటుంబానికి సమాచారం అందించారు. అభం శుభం తెలియని చిన్నారి తన బాబాయ్ చనిపోయాడు అనే విషయం కూడా తెలియక తనపై నిద్రపోవడం పలువురిని కంటతడి పెట్టించింది.































