భారత్ ఖాతలో మరో పతకం చెరింది. ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. జర్మనీతో జరిగిన పోరులో 5-4 తేడాతో గెలిచి కాంస్య పతకం గెలిచింది. 41 సంవత్సరాల సుధీర్ఘ విరామం తర్వాత భారత్ పతకం సాధించి విశ్య క్రీడా యవ్వనికపై మువ్వెన్నల జెండాను సగౌరవంగా ఎగేరేసింది. 1980 తర్వాత ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు పతకాన్ని గెలిచింది.

కాంస్య పతకం కోసం జర్మనీతో జరిగిన హోరాహోరి పోరులో భారత క్రీడాకారులు సత్తా చాటారు. ప్రత్యర్థిని 5-4 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు. చివరిలో జర్మనీ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన డిఫెండర్లు, గోల్ కీపర్ సమర్థవంతంగా అడ్డుకొని ఒలింపిక్ పతకాన్ని ఒడిసిపట్టారు.



























