మాలీ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 41 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అతి వేగంతో వచ్చిన ఓ ట్రక్కు.. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మాలీలోని సెగౌ పట్టణం సమీపంలో ఘటన చోటు చేసుకున్నది. ప్రమాదం అనంతరం రవాణా మంత్రిత్వ శాఖ, పోలీసులు సహాయక చర్యలు చెపట్టారు.

వేగంతో వెళ్తున్న ట్రక్కు టైర్ పేలడంతో వాహనాన్ని అదుపు చేయలేకపోయిన డ్రైవర్ మరో మార్గంలోకి వస్తున్న బస్సును ఢీకొట్టాడు. ఇలా బలంగా ఢికొట్టడంతో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయి పోయింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కొల్పోగా మరో 33 మంది గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సెగో పట్టణంలోని దవాఖానకు తరలించారు.































