రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా సమీపంలో శనివారం హైవేపై ట్రక్కు,కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు. కుచమన్ టౌన్ సమీపంలో హైవేపై ట్రక్కును కారు వేగంగా ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంతాపం తెలిపారు.”నాగౌర్‌లోని కుచమన్ సిటీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించడం చాలా బాధాకరం. బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చెస్తున్నాను ” అని ఆయన ట్వీట్ చేశారు.































