సాధారణంగా మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది అంటే తప్పెట్లు… బాజాభజంత్రీలు, ఇంటికి అతిథులు, మూడు ముళ్ళు, ఆట పాటలు, పిల్లలు చేసే సందడి ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా పెళ్లి అంటే చెప్పుకోవాల్సిన సంగతి మరొకటి ఏమిటంటే పెళ్లిలో భోజనాలు. పెళ్లిలో వివిధ రకాల తీపి పదార్థాలు, వివిధ రకాల వంటకాలతో ఎంతో అద్భుతంగా పసందైన వంటలను తయారు చేస్తాము. ఈవిధంగా పెళ్లికి వచ్చిన అతిథులందరూ పెళ్లి భోజనం చేసి వధూవరులను ఆశీర్వదించి వెళ్తుంటారు.

ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా పెళ్ళిళ్ళలో ఈ ఆట పాటలు, సరదా సన్నివేశాలు, పంక్తి భోజనాలు కరువయ్యాయి. ఇప్పుడు అన్ని ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌లతో అతిథులకు భోజనాలు పంపే ట్రెండ్ కూడా ఈ మధ్య కనిపిస్తోంది. ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఒక వెడ్డింగ్ మెనూకార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మెనూకార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. బెంగాలీ ఇంట 90 లో జరిగిన పెళ్లిలో వడ్డించిన వంటకాలను చూసి నెటిజన్లు ఆ పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ట్విట్టర్ యుజర్ ఈ వెడ్డింగ్ నో కార్డును సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ..‘‘ఓ మై గాడ్… మా తల్లిదండ్రుల వెడ్డింగ్ రిసెప్షన్ మెనూ కార్డును మా కజిన్ వెలికితీశాడు’’అంటూ షేర్ చేశారు. ఈ వెడ్డింగ్ మెనూ కార్డులో శాకాహారుల కోసం ప్రత్యేకంగా రాధాబ్‌లావీ, దమ్ ఆలూ, వెజిటబుల్ కట్‌లెట్, మోటార్ పన్నీర్, చట్నీ, పాపడ్, కమలాభోగ్, ఐస్‌క్రీం… నాన్ వెజ్ తినేవారికి… ఫిష్ బట్టర్ కర్రీ, చిల్లీ ఫిష్, చికెన్ రెజాలా’’ వంటి వెరైటీలు వడ్డిస్తామని పేర్కొన్నారు.
ఈ వెడ్డింగ్ నిను చూసిన భోజనప్రియులు స్పందిస్తూ ఈ మెనూకార్డ్ చూస్తుంటే నోరూరిపోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు బిర్యాని కూడా పెట్టి ఉంటే వెడ్డింగ్ మెను అదిరిపోయేది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు నా పెళ్లిలో కూడా ఈ విధంగా మా సంస్కృతి కి తగ్గట్టుగానే వంటకాలు చేయిస్తా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరెందుకాలస్యం వెరైటీ వెడ్డింగ్ మెనూ కార్డుపై ఓ లుక్కేయండి.































