Mahesh Babu : సెలబ్రిటీలు ఏం వేసుకున్నా అది ట్రెండ్ అయిపోతుంది. వాళ్లు వాడే వస్తువుల గురించి తెలుసుకోవాలని అభిమానులకు ఉంటుంది. ముఖ్యంగా మన స్టార్ హీరోలు, క్రికెటర్లు వేసుకునే బట్టలు, వాడే బ్యాగులు, చెప్పులు ఇలా ప్రతిదీ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వేసుకున్న టీ-షర్ట్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.

అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 8న హైదరాబాద్‌లోని అక్కినేని స్టూడియోస్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. మహేష్ బాబు తన భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి రిసెప్షన్‌కు హాజరయ్యారు. అఖిల్, జైనబ్‌లను ఆశీర్వదించారు.
అయితే అందరి కళ్లు మహేష్ బాబు వేసుకున్న డ్రెస్సుపై పడ్డాయి. ముఖ్యంగా ఆయన వేసుకున్న టీ-షర్ట్ చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉందంటూ కామెంట్స్ వచ్చాయి. కానీ ఆ టీ-షర్ట్ ఏదో మామూలుది కాదు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాండ్లలో ఒకటైన ‘హెర్మ్స్’కు చెందినది. దాని ధర అక్షరాలా రూ. 1.51 లక్షలు! ఇది విన్న అభిమానులు షాక్ అవుతున్నారు. అంత డబ్బుతో ఒక లగ్జరీ బైక్ కొనుక్కోవచ్చు కదా అని అంటున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి.

































