Crime News: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా కొంతమంది కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఎన్ని శిక్షలు విధించిన మారడం లేదు. అమ్మాయి అని తెలిస్తే చాలు.. వయస్సుతో సంబంధం లేకుండా.. అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

వాయి వరుసలు మరిచి.. బంధువులు అని కూడా చూడకుండా.. కూతురు వరుస అయ్యే వాళ్లతో కూడా పాడు పనులు చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ క్షేమంగా తిరిగి ఇంటికి వస్తుందన్న నమ్మకం లేకుండా చేస్తున్నారు ప్రబుద్ధులు.

ప్రేమ పేరుతో మోసం చేసి ఆత్యాచారానికి పాల్పడిన ఘటనలు కూడా కొకొల్లలు జరిగాయి.ఇలాంటి ఘటన ఒకటి ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో రాకేశ్ అనే అతడు సీనియర్ వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఇటీవల అతడికి ఓ అమ్మాయి మ్యాట్రిమోని వెబ్ సైట్ ద్వారా పరిచయం అయింది.
వైద్యులు పోలీసులకు సమాచారం అందించగా..
ఆ రోజునుంచి ఫోన్లలో మాట్లాడుకుంటూ.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. ఇదే అదునుగా భావించిన అతడు ఆమెను ఓ రోజు ఆసుపత్రికి రమ్మని పిలిచాడు. అక్కడ నుంచి అతడు ఆమెను తన క్వార్టర్స్ కి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను మాటల్లో పెట్టి.. మాయమాటలు చెప్పి.. అత్యాచారం చేశాడు. ఈ ఘటన తర్వాత ఆమె స్పృహతప్పి పడిపోయింది. భయపడిపోయిన ఆమెను రాకేశ్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షలు చసిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగినట్లు వెల్లడించారు. దీంతో రాకేశ్ అక్కడ నుంచి పారిపోయాడు. వైద్యులు పోలీసులకు సమాచారం అందించగా.. ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అతడు పని చేస్తున్న ఆసుపత్రికి వెళ్లిన పోలీసులకు అతడు పరారీలో ఉన్నట్లు తెలుసుకున్నారు. దీనిపై పోలీసులు ఫోన్ లొకేషన్ ఆధారంగా అతడి ఆచూకీ తెలుసుకున్నారు.






























