Flash Back : సాధారణంగా ఇండస్ట్రీలో ఒక హీరోతో మరొక హీరోకి తమ సినిమాల విషయంలో పోటీ ఉంటుంది. ముఖ్యంగా ఏవైనా పండుగల సందర్భంగా సినిమాలు రిలీజ్ చేస్తూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఒకే సినిమా పేరుతో ఇద్దరు హీరోలు పోటీ పడిన సందర్భాలు కుడా ఉన్నాయి.

ఇప్పటి వరకు తనతో తానే పోటీ పడిన హీరోలూ చాలా అరదు. అటువంటి వారిలో బాలకృష్ణ, నానితో పాటు హీరో సుమన్ కూడ ఒకరు. 1990 జనవరి నెలలో సంక్రాంతి సందర్భంగా ఎన్నో సినిమాలూ రిలీజ్ అయ్యి పోటీ పడ్డాయి. వాటిలో ‘రావుగారింట్లో రౌడీ’ , ‘కొండవీటి రౌడీ’ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కుడా కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమాలే. ఈ రెండు సినిమాలలో కూడా హీరో సుమన్.

ఈ రెండు సినిమాల టైటిల్స్ కూడా రౌడీ అని ఉండటం గమనార్హం. అంతే కాకుండా ఈ రెండు సినిమాలకు రాజ్ కోటి సంగీతాన్ని అందించారు. ‘రావుగారింట్లో రౌడీ’ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా.. “కొండవీటి రౌడీ” సినిమాకి సత్య రెడ్డి దర్శకత్వం వహించాడు. ఒక్క రోజు తేడాతో ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి.

పోటీలో గెలిచిన రావుగారింట్లో రౌడీ …
సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీ రావు గారి ఇంట్లో రౌడీ సినిమా విడుదల కాగా మరుసటి రోజు అంటే జనవరి 13వ తేదీ కొండవీటి రౌడీ సినిమా విడుదలైంది. ఈ రెండు సినిమాలలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన “రావుగారింట్లో రౌడీ” అనే సినిమాకు మంచి స్పందన లభించింది. వసూళ్ల విషయంలో కూడా ఈ సినిమా ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఈ రెండూ సినిమాలలో హీరో ఒక్కరే అయినప్పటికీ వాటి ఫలితాలు మాత్రం వేరుగా వచ్చాయి.
































