Bindu Madhavi: తెలుగు సినీ ప్రేక్షకులకు సినీ నటి అయిన బిందుమాధవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిందు మాధవి ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. మొదట ఆవకాయ బిర్యాని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ హీరోయిన్ గా నటించిన బిందుమాధవి మాత్రం మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా తర్వాత బిందుమాధవి కొద్దిరోజుల పాటు తెలుగు సినిమాలలో నటించలేదు.

ఆ తరువాత కోలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లోనే మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇదిలా ఉంటే బిందు మాధవి ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బిందు మాధవి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తోంది. బిగ్ బాస్ ద్వారా బాగానే పాపులారిటీ సంపాదించుకుంది బిందు మాధవి.

మొదటి నుంచి కూడా ఓటింగ్ విషయంలో ముందంజలో ఉంటూ టైటిల్ హాట్ ఫేవరెట్ కంటెస్టెంట్ గా దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా బిందుమాధవి లవ్ ఫెయిల్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బిందు మాధవి తమిళ్ హీరో అయిన హరీష్ కళ్యాణ్ తో రిలేషన్ లో ఉన్నారనే వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. అయితే గతంలో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని జోరుగా ప్రచారం కొనసాగిన సంగతి మనకు తెలిసిందే.
బెస్ట్ విషెస్ టు మై డియర్…
తాజాగా హీరో హరీష్ కళ్యాణ్ బిగ్ బాస్ లో ఉన్న బిందు మాధవికి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. దీంతో వీరిద్దరి పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. మాధవి ఇప్పటికే తమిళ సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి మనందరికీ తెలిసిందే. హీరో హరీష్ కళ్యాణ్ కూడా అదే సీజన్ లో మరొక కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని వినిపిస్తున్నాయి. హీరో హరీష్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తూ.. బెస్ట్ విషెస్ టు మై డియర్ ఫ్రెండ్ బిందు మాధవి..యూ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ అంటూ ట్వీట్ చేశాడు. ఇందుకు సంబంధించిన ట్వీట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Best wishes to my dear friend @thebindumadhavi your doing a great job in #BiggBossNonStopTelugu ????????????#BiggBossNonStopTelugu #ShowStealerBindu
— Harish Kalyan (@iamharishkalyan) April 10, 2022
































