మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. తల్లితో కలిసి అడవిలో కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై, అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

తల్లి ముందుగా నడుస్తుండగా, వెనుకబడ్డ బాలికను బాలుడు పొదల్లోకి లాక్కెళ్లి, నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా దాడి చేశాడు. అనంతరం, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
పైనుంచి ఎవరూ ఆ విషయాన్ని గమనించలేకపోయారు. అయితే బాలిక తిరిగొచ్చిన తర్వాత నడవడంలో ఇబ్బంది పడుతూ, కడుపునొప్పితో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం అసలు విషయం వెలుగులోకి రావడంతో, వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందిత బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

































