Celebrity Divorce Couples: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎప్పుడు ప్రేమలో పడతారో ఎప్పుడు విడిపోతారో ఎవరికీ తెలియదు. ఎంత తొందరగా ప్రేమలో పడితే అంత తొందరగా విడిపోవడం కూడా జరుగుతుంది. గత ఏడాది సమంత నాగచైతన్య దంపతులు అలాగే అమీర్ ఖాన్ కిరణ్ రావు దంపతులు విడిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.

ఈ క్రమంలోనే ఈ ఏడాది మొదట్లోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య దంపతులు కూడా విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొన్ని రోజుల నుంచి చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కళ్యాణ్ దేవ్ కూడా విడాకులు తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి.ఇలా వీరందరూ విడిపోవడానికి వ్యక్తిగత కారణాలు కావచ్చు కానీ వీరి వీడిపోతున్నారని ముందుగానే సోషల్ మీడియాలో హింట్ ఇస్తున్నారు.

సమంత విషయానికి వస్తే సమంత పెళ్లి అయిన తర్వాత సమంత అక్కినేని అనే పేరును సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టుకున్నారు.ఎప్పుడైతే నాగచైతన్యతో తనకు మనస్పర్థలు వచ్చాయో వెంటనే అక్కినేని అనే పేరును తొలగించి సమంత పేరును మాత్రమే పెట్టుకున్నారు.ఇలా సమంత అక్కినేని పేరును తొలగించినప్పుడే వీరిద్దరు విడిపోతున్నారు అంటూ పెద్దఎత్తున అనుమానాలు మొదలయ్యాయి.
సరి కొత్త ట్రెండ్ ఇదే…
అందరూ అనుకున్న విధంగానే సమంత నాగచైతన్య విడిపోయారు. అదేవిధంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రియాంక చోప్రా తన భర్త పేరును తొలగించడంతో వీరిద్దరూ కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ విషయంపై ప్రియాంక చోప్రా వెంటనే స్పందిస్తూ అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం సమంత బాటలోనే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పయనిస్తున్నారు. శ్రీజ పెళ్లి తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవ్ పేరును సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. అయితే గత కొంత కాలం నుంచి శ్రీజ కళ్యాణ్ దేవ్ పేరును తొలగించి కొణిదల అనే పేరు పెట్టుకోవడంతో వీరిద్దరూ కూడా విడిపోతున్నారు అంటూ అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇలా భర్త పేర్లను తొలగించడం ఆపై విడాకులు ఇవ్వడం ట్రెండ్ అవుతోందని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
































