CRIME: బీహార్ నలంద జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇల్లు వదిలి ఉపాధికి వెళ్లిన ఓ కుటుంబం.. ఐదారేళ్ల తరువాత ఇంటికి రావడంతో అక్కడ జరిగింది చూసి షాక్ తిన్నారు. ఇంటికి తాళాలు వేసి ఉన్నా.. ఇంట్లో ఓ మనిషి అస్థిపంజరం దొరకడం అందర్ని భయాందోళనకు గురిచేసింది.

వివరాల్లోకి వెళ్తే బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలోని సర్మేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో దాదాపు 5-6 ఏళ్ల నుంచి ఓ ఇళ్లు మూసి ఉంది. అందులో ఉండే కుటుంబీకులు నారో కాబ్లర్ అనే వ్యక్తి అతని భార్య పిల్లలతో ఢిల్లీకి ఉపాధి నిమిత్తం వెళ్లాడు. దీంతో మీర్ నగర్ గ్రామంలో తన సొంతింటికి తాళాలు వేసి ఊరు వదిలాడు.

అయితే ఇటీవల ఢిల్లీ నుంచి సొంతూరుకు వచ్చాడు. తాళాలు తీసి ఇంట్లోకి అడుగుపెట్టగానే ఓ ఘాడమైన వాసన రావడంతో.. ఇళ్లంతా వెతికాడు. ఓ ప్రదేశంలో నుంచి ఎక్కువ వాసన వస్తుందని గుర్తించి తవ్వి చూస్తే.. మనిషి అస్థి పంజరం బయటపడింది. దీంతో భయపడిన కుటుంబీకులు.. ఆ విషయాన్ని గ్రామస్థులకు తెలియ జేశారు.
ఫోరెన్సిక్ పరీక్షకు అస్థిపంజర్..
ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకుని.. గ్రామంలో విచారించారు. అస్థి పంజరాన్ని పోలీసులు ఫోరెన్సిక్ పరీక్ష కోసం పాట్నాకు తరలించామని సర్మెర స్టేషన్ ఇంఛార్జ్ వివేక్ రాజ్ తెలిపాడు. అసలు పోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయం భయటపడనుంది. తాళాలు వేసి ఉంచిన ఇంటిలోకి శవం ఎలా వచ్చింది…ఎవరైనా చంపి ఖాళీగా ఉన్న ఇంట్లో పాతిపెట్టారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.





























