Pawan Kalyan: ఏపీ ఎన్నికలు ఈసారి ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. ఎప్పుడు లేని విధంగా భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో ఈ ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారనే విషయంపై ఎంతో ఉత్కంఠత నెలకొంది. ఒకవైపు జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని చూస్తే కనుక తప్పకుండా జగన్ అధికారంలోకి వస్తారని అందరూ భావించారు కానీ మరికొందరు కూటమి అధికారంలోకి వస్తుందని కూడా భావించారు.

ఈ క్రమంలోనే చాలామంది ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారనే విషయంపై భారీ స్థాయిలో బెట్టింగులు కట్టారు. దీంతో చాలామంది కోట్లలో లాభాలు పొందగా మరికొందరు కోట్లు నష్టం ఎదుర్కొన్నారని కూడా చెప్పాలి. ఇక సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈయన గెలుపోటములపై కూడా భారీ స్థాయిలో బెట్టింగులు జరిగాయని తెలుస్తుంది.
భారీ మెజారిటీతో గెలిచిన పవన్..
కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ గెలుపు ఓటమిపై కోటలో బెట్టింగులు జరిపారట. ఇండస్ట్రీలో బడా నిర్మాతగా పేరు సంపాదించుకున్న ఓ ప్రొడ్యూసర్ ఏకంగా పవన్ గెలవడని 10 కోట్ల రూపాయలు పెట్టు పెట్టినట్టు సమాచారం. అయితే పవన్ భారీ మెజారిటీతో గెలవడంతో ఆ నిర్మాతకు 10 కోట్లు నష్టమనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఆ ప్రొడ్యూసర్ ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రం బయటికి రాలేదు.





























