YSRCP: ఏపీ ఎన్నికల కౌంటింగ్ కి మరికొన్ని గంటలు సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి తరుణంలోనే అధికారంలోకి ఎవరు రాబోతున్నారు అనే విషయంపై ఎంతో ఆసక్తి, ఉత్కంఠత నెలకొంది. ఇకపోతే ఇప్పటికే ఎన్నో సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి.ఈ క్రమంలోనే ఆరా మస్తాన్ సర్వే మాత్రం సంచలనంగా మారింది. ఈయన వైఎస్ఆర్సిపి పార్టీకి 90 నుంచి 14 సీట్ల వరకు వస్తాయని వీలైతే పది సీట్లు అదనంగా వస్తాయి తప్ప తగ్గేది లేదంటూ ఛాలెంజ్ చేశారు.

ఇక ఆరా మస్తాన్ సర్వేలో భాగంగా మంగళగిరిలో నారా లోకేష్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ వీరంతా కూడా భారీ మెజారిటీతో గెలవబోతున్నారని తెలిపారు. ఇక ఈయన వైసీపీ నేతల గురించి కూడా తన సర్వేలో ప్రిడిక్షన్ వెల్లడించారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి కొడాలి నాని రోజా వంటి వారందరికీ ఓటమి తప్పదని తెలిపారు.
గుడివాడ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నటువంటి కొడాలి నాని అలాగే గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వల్లభనేని వంశీలకు ఈసారి ఎదురు దెబ్బ తగలబోతుందని ఆరా మస్తాన్ పరోక్షంగా తెలిపారు. ఈ రెండు నియోజకవర్గాలలో ఈ నేతలను ఓడించడం కోసం భారీ స్థాయిలో వ్యూహాలు రక్షిస్తున్నారని అందుకే ఎగ్జిట్ పోల్ సమయంలో ఈ రెండు నియోజకవర్గాలపై గెలుపు ధీమా వ్యక్తం చేయలేదని ఆయన తెలిపారు.
పోటా పోటీగా గుడివాడ,గన్నవరం..
ఈ రెండు నియోజకవర్గాలలో నువ్వా నేనా అనే విధంగా పోటీ జరుగుతోందని మరి ఎవరు ఈ నియోజకవర్గాలలో గెలుపు సాధిస్తారనేది తెలియాలి అంటే మరొక రోజు వేచి చూడాల్సిందేనని ఆరా మస్తాన్ వెల్లడించారు. ఇక ఈయన జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ ఉదయ్ నాదెండ్ల మనోహర్ వంటి వారు గెలుస్తారని కూడా వెల్లడించారు.





























