Aara Mastan: మరి కొన్ని గంటలలో ఎవరు గెలవబోతున్నారు అనే విషయాలు పూర్తిగా తెలియనున్నాయి. అయితే ఎన్నికలు మే 13 న జరగగా ఎన్నికల ఫలితాలు నేడు రాబోతున్నాయి అయితే ఎన్నికల ఫలితాలలో కాకుండా ఇప్పటికే పలు సర్వే సంస్థలు ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆరా మస్తాన్ సైతం తన సర్వే ఫలితాలను తెలిపారు.

ఈ సందర్భంగా ఈయన సర్వేలో భాగంగా కూటమికి 70 నుంచి 81 వరకు సీట్లు రావచ్చని, అలాగే వైఎస్ఆర్సిపికి 95 నుంచి 104 వరకు సీట్లు రావచ్చని తెలిపారు. ఇక వైఎస్ఆర్సిపిదే అధికారం అని తెలిపిన ఈయన తాను చెప్పిన సీట్ల కంటే ఇంకా ఎక్కువే రావచ్చు కానీ తగ్గే పరిస్థితిలో ఏమాత్రం లేదని తెలిపారు.
ఇక వైఎస్ఆర్సిపి పార్టీ ఎందుకు అధికారంలోకి రాబోతుందని విషయాలు గురించి కూడా ఈయన పలు యూట్యూబ్ ఛానల్ లో పాల్గొంటూ విశ్లేషణ చేశారు.కూటమికి పడే ఓట్ల శాతం 47.55 శాతం వరకు ఉండొచ్చు. టీడీపీ కూటమికి పురుషుల ఓట్లు 51.56, మహిళల ఓట్లు 54.76 శాతం మేర పడ్డాయని ఆరా మస్తాన్ సర్వే తెలిపింది.
జగనే సీఎం..
ఈ ఎన్నికలు- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జగన్‌ను ప్రేమించిన వర్గాలు, ఆయన ప్రభుత్వంలో లబ్దిపొందిన వారికి జరుగుతున్న యుద్ధంగా పేర్కొన్నారు. ఇలా వైసిపికి అనుకూలంగా తీర మాట్లాడటంతో మరికొన్ని పార్టీలకు సంబంధించిన కీలక నేతలు తనకు పదేపదే ఫోన్లు కూడా చేస్తున్నారని, అయితే తాను ఆ ఫోన్స్ లిఫ్ట్ చేయడం లేదు అందుకని మిస్డ్ కాల్స్ అన్నింటిని కూడా చూపించారు. ఇక ఈ ఫోన్లో చేసినటువంటి వారిలో తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రమే కాకుండా తెలంగాణ మంత్రులు కూడా ఉన్నారని తెలుస్తుంది.





























