Aata Sandeep: టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర మీద ఎన్నో రకాల టీవీ షోలో ప్రసారం అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కామెడీ, డాన్స్, సింగింగ్ షోల ద్వారా ఎంతోమంది తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో గుర్తింపు పొందుతున్నారు. ఇలా ఆట డాన్స్ షో ద్వారా ఎంతోమంది కొరియోగ్రాఫర్లుగా గుర్తింపు పొందారు. ఇలా ఆట డాన్స్ షో ద్వారా గుర్తింపు పొందిన వారిలో సందీప్ కూడా ఒకరు. ఆట సీజన్ వన్ లో విన్నర్ గా నిలిచిన సందీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈ షోలో విన్నర్ గా నిలిచి గుర్తింపు పొందిన సందీప్ ఆట సందీప్ గా అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సందీప్ సినిమాలలో కొరియోగ్రఫీ చేస్తూనే ప్రత్యేక ఈవెంట్స్ లో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. అంతేకాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సందీప్ తన భార్య జ్యోతిరాజ్ తో కలిసి డాన్స్ వీడియోలు చేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. అంతేకాకుండా జీవితానికి సంబంధించిన విషయాల గురించి కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియా ద్వారా సందీప్ తన అభిమానులకు శుభవార్త తెలియజేశాడు. ఐదేళ్లు కష్టపడిన తర్వాత ఎట్టకేలకు తన సొంతింటి కల నెరవేరినట్లు సందీప్ వెల్లడించాడు. తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా కొత్త ఇంటికి సంబంధించిన విశేషాల గురించి వెల్లడించారు. ఇటీవల వారి ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయినట్లు వివరించారు. కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న కూడా ఒంటరిగా పోరాటం చేస్తూ సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం దాదాపు 5 సంవత్సరాల పాటు కష్టపడినట్లు వెల్లడించారు.

Aata Sandeep: ఐదేళ్ల కష్టం సొంతింల్లు
ఇలా తమ సొంత ఇంటి కల నెరవేర్చుకోవటం కోసం వారు పడిన కష్టాల గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ క్రమంలో తమకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇన్స్టా లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలతో పాటు సందీప్ అభిమానులు కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు
































