Aata Srividhya : ఈటీవీ లో వచ్చే ‘పోపులపెట్టె’ సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయి ఆ తరువాత ఈటీవీ సీరియల్ ‘సంఘర్షణ’లో ధరణి గా నటించిన శ్రీవిద్య అందరికీ సుపరిచితురాలే. ఇక ‘ఆట’ ప్రోగ్రామ్ తో మరింత పాపులర్ అయిన శ్రీ విద్య కెరీర్ బాగా ఉన్న సమయంలోనే డైరెక్టర్ వక్కంతం వంశీని పెళ్లి చేసుకుని టీవీకి దూరమయ్యారు. చాలా రోజుల తరువాత మళ్ళీ కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న శ్రీ విద్య తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.

అలా ప్రేమించి పెళ్లి చేసుకున్నా…
ఆట శ్రీవిద్య పలు టీవీ షోస్ చేస్తూ బాగా పాపులర్ అయిన సమయంలోనే ప్రేమించి పెద్దలను ఒప్పించుకుని వక్కంతం వంశీ గారిని పెళ్లి చేసుకుంది. అసలు వీరి ప్రేమ ఎలా మొదలయింది అనే విషయాల గురించి మాట్లాడుతూ ఫోన్ ముచ్చట్లతో వారి స్నేహం మొదలయిందంటూ శ్రీవిద్య తెలిపారు. అలా స్నేహితులుగా ఉన్న సమయంలోనే సరదాగా లవ్ యూ చెప్పగా అలా ఫ్రెండ్ కి లవ్ యూ చెప్పావ్ ఏంటి అని వంశీ అడిగారట.

అయితే శ్రీవిద్య ఊరికే చెప్పానని అన్నా చివరికి వారి బంధం బలపడి ప్రేమించుకున్నారట. అయితే వీరి విషయం ఇంట్లో వాళ్లకు చెప్పి వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయ్యాక కెరీర్ కు దూరం అయ్యారు శ్రీవిద్య. ప్రస్తుతం తన పిల్లల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు సినిమా, టీవీ రంగంలో కంటే యూట్యూబ్ ద్వారా ఎక్కువ మందికి చేరువ అవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు శ్రీవిద్య.






























