ఇది వర్షాకాలం. అయినా కొన్ని ఏరియాల్లో అనుకున్నంత మేర వర్షాలు కురవడం లేదు. దీంతో అక్కడ గ్రామస్తులు వర్షాలు కురవాలని.. వాన దేవుడికి పూజలు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లోనే విజయనగరం జిల్లా సాలూరు ఏజెన్సీలోని ఓ గిరిజన గ్రామంలో వర్షాలు కురవాలని.. రైతులు ఓ వింత ఆచారాన్ని పాటించారు. అందేంటో తెలుసుకుందాం..

విజయనగరం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామానికి చెందిన రైతులు.. ఈ గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాకరమ్మ కొండపై ఆరిలోవ నీళ్లసర్రి వద్ద కొండభైరవుడు, జాకరమ్మలకు పూజలు నిర్వహించారు. ఈ దేవుళ్లను పూజిస్తే వరుణుడు కరిణించి వర్షాలు పుష్కలంగా కురిపిస్తాడని ఇక్కడ రైతులకు, గ్రామస్తులకు నమ్మకం. మామూలుగా అయితే ఎవరైనా వన భోజనాలకు వెళ్లి అక్కడ భోజనం చేసి.. కుటుంభ్యులతో కాస్తంత సమయాన్ని కేటాయిస్తూ.. ఎంజాయ్ చేస్తారు.
అక్కడే నాన్ వెజ్ వండుకొని వన భోజనాన్ని ఆరగిస్తారు. ఇక్కడ కూడా వాళ్లు వారితో పాటు బియ్యం, బెల్లంతో పిల్లా పాపలతో కలిసి గుట్టపై కి వెళ్లారు. అక్కడ దేవుళ్లకు నైవేద్యం సమర్పించిచే ముందు మేకలను, గొర్రెలను అమ్మవారికి బలిచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు. దేవుళ్లకు సమర్పించిన తర్వాత ప్రసాదాన్ని కొండ రాయిపై వంతుల్లా వేస్తారు.
తర్వాత వాటిని మోకాళ్లపై కూర్చొని.. ఒక్కొక్కరు ఆ పరమాన్నాన్ని నాలుకతో నాకి తిన్నారు. ఇలా పూజ చేస్తేనే వర్షాలు కురుస్తాయనే గ్రామస్తులు నమ్ముతారు. ఇలాంటి ఆచారాన్ని గ్రామస్తులు గత 60 సంవత్సరాల నుంచి పాటిస్తున్నట్లు వారు చెప్పుకొచ్చారు. ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని వారి నమ్మకం.



























