Jagapathi Babu: నటుడు జగపతిబాబు ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈయన హీరోగా సుమారు వంద సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం హీరోగా కాకుండా విలన్ గా నటించారు. అయితే ఈయనకు విలన్ పాత్రలలోనే మంచి ఆదరణ లభిస్తుందని విలన్ గానే మంచి సక్సెస్ అయ్యానని పలు సందర్భాలలో తెలిపారు.

ప్రస్తుతం ఏమాత్రం తీరికలేకుండా తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా హిందీ తమిళ కన్నడ భాష చిత్రాలలో కూడా ఈయన నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే జగపతిబాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
ఇక తనకు ఏదైనా పని చేయాలి అనిపిస్తే అభిమానుల నిర్ణయం కూడా తీసుకుంటారనే విషయం మనకు తెలిసిందే .అయితే తాజాగా ఫిబ్రవరి 12వ తేదీ జగపతిబాబు పుట్టినరోజు కావడంతో ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్ గా మారింది. ఒక చేతిలో కూల్ డ్రింక్ బాటిల్ మరో చేతిలో ఆల్కహాల్ బాటిల్ పట్టుకొని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.
ఏది తాగమంటారు…
ఎలాగో పుట్టేసాను ఈరోజు నేను ఏది తాగమంటారు చాలా తొందరగా ఆలస్యం చేయకుండా సమాధానం చెప్పండి అంటూ ఈయన ఈ పోస్ట్ చేశారు. దీంతో కొందరు ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అంటూ సమాధానం చెప్పగా మరికొందరు రెండు మిక్స్ చేసుకొని తాగండి అంటూ ఈయనకు సలహాలు ఇస్తున్నారు. ఏది ఏమైనా ఒక స్టార్ హీరో మందు తాగమంటారా అంటూ అభిమానులను ఇలా సలహా అడగటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది అయితే ఈయనకు మద్యం జూదం వంటి వ్యసనాలు ఉన్నాయని ఒకానొక సమయంలో డైరెక్ట్ గా చెప్పిన సంగతి తెలిసిందే.

































