బెంగళూరు, కర్ణాటక: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చారిత్రక యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ రేపు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్, టీజర్, పాటలు సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కావడం కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

కర్ణాటక రక్షణ వేదిక ఆందోళన: ఫ్లెక్సీల చింపివేత
అయితే రిలీజ్‌కు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని ఓ థియేటర్ వద్ద ‘కర్ణాటక రక్షణ వేదిక’ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. థియేటర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సినిమా ఫ్లెక్సీలను చింపేసి హల్‌చల్ చేశారు. దీనికి కారణంగా ఫ్లెక్సీలపై పేరు కన్నడ భాషలో లేకపోవడమేనని వారు పేర్కొన్నారు.
కర్ణాటకలో విడుదలవుతున్న ప్రతి సినిమా టైటిల్ లేదా ప్రచార పదాలు స్థానిక భాష అయిన కన్నడలో కూడా ఉండాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ఇది జరగకపోతే, తమ వ్యతిరేకతను తీవ్రంగా వ్యక్తపరుస్తామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నెటిజన్ల అభిప్రాయాలు, పోలీసుల జోక్యం
ఇక ఈ ఘటనపై నెటిజన్ల అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి. కొందరు “భాషకు గౌరవం ఇవ్వాలి” అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే, మరికొందరు సినిమా అడ్డుకోవడం ద్వారా అభిమానుల భావోద్వేగాలతో ఆడుకోవడం సరికాదని ఘాటుగా స్పందిస్తున్నారు.
ప్రస్తుతం స్థానిక పోలీసులు పరిస్థితిని నియంత్రించారు. అయినప్పటికీ, ఇది సినిమాపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ‘హరిహర వీరమల్లు’ సినిమా స్మూత్‌గా విడుదల కావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
We celebrated KGF and Kantara as our own.
— Milagro Movies (@MilagroMovies) July 23, 2025
But now, a few from Karnataka have removed #HHVM banners.
Sad to see such behaviour when cinema should unite us, not divide us#HariHaraVeeraMallu pic.twitter.com/dTG5JVQ0bW































