Actor Aditya Om: టాలీవుడ్ హీరో మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో తన సొంత గ్రామాన్ని దత్తత తీసుకొని తమ గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నట్లు చూపించారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నిజంగానే కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామంలోని ప్రజలకు మౌలిక సదుపాయాలను సమకూర్చారు.

ఈ విధంగా మహేష్ బాబు కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడంతో ఇదే ఇన్స్పిరేషన్తో ఎంతోమంది హీరోలు పలు గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాలకు మౌలిక సదుపాయాలను అందిస్తూ ఉన్నారు. ఇలాంటి కోవకు చెందారు నటుడు ఆదిత్య ఓం.ఈయన ఎన్నో సినిమాలలో హీరోగా నటించడమే కాకుండా దర్శకుడిగా కూడా తన సత్తా చాటుకున్నారు.
ఇలా నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆదిత్య ఓం ఇదివరకే ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇకపోతే తాజాగా కొత్తగూడెం జిల్లా మరియు తాండూరులోని చెరుపల్లి, కొత్తపల్లి పరిసర ప్రాంతాలలో ఐదు గ్రామాలకు అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. అక్కడ గిరిజన గ్రామాల్లో గత కొంతకాలంగా పనిచేస్తున్నటువంటి ఈయన అక్కడ వారు ఎదుర్కొనే ఇబ్బందులను చూసి చలించిపోయారు. ఈ క్రమంలోనే వారికి ఎంతో అత్యవసరమైనటువంటి అంబులెన్స్ సేవలను ప్రారంభించి మంచి మనసు చాటుకున్నారు.

Actor Aditya Om: గిరిజనుల కష్టాలు చూసి చలించిన హీరో..
కొత్తగూడెం ప్రాంతంలో పేరుగాంచిన రోటరీ క్లబ్ మరియు దానికి సంబంధించిన స్థానిక సంస్థల ఆర్థిక సహాయంతో ఈ ప్రాంతాలకు ఈయన అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఇలా అందరి సహాయంతోనే తాను ఈ గ్రామాలకు అంబులెన్స్ సేవలను తీసుకువచ్చానని ఈ పని వల్ల ఎంతో మంది ప్రాణాలు ప్రమాదంలో పడకుండా కాపాడగలవచ్చు అంటూ ఈయన ఆశాభావం వ్యక్తం చేశారు.
































