తెలుగులో సుమన్, దివంగత నందమూరి హరికృష్ణ కీలక పాత్రలో నటించిన లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించి ప్రేక్షకులను సందడి చేసిన నటుడు ఆదిత్య ఓం ఒకరు. ఇతను పలు సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించి బీ టౌన్ ఎంట్రీ ఇచ్చారు. సాధారణంగా హీరో పాత్రలో నటించడం మనం చూస్తూ ఉంటాము కాని ఒకే హీరో విలన్, కమెడియన్, డైరెక్టర్ హీరో పాత్రలో నటించాలంటే ఎంతో కష్టం. అలాంటి హీరోలు చాలా అరుదుగా ఉంటారు. అలా అరుదైన హీరోలలో ఆదిత్య ఓం ఒకరు.

ఇలా తెలుగు తమిళ హిందీ భాషలలో నటుడిగా దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆదిత్య ప్రస్తుతం విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ఇతను ఏకంగా మూడు సినిమాలలో నెగిటివ్ పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఇండస్ట్రీలోకి నాగ వర్మ అనే హీరో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు విక్రమ్ అనే టైటిల్ ను ఎంపిక చేశారు.
విక్రమ్ సినిమాలో ఆదిత్య ఓం మాఫియా బాస్ గా నెగిటివ్ పాత్రలో నటిస్తున్నారు.దీనితోపాటు అమరం, పవిత్ర అనే సినిమాలో కూడా ఈయన విలన్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక అమరం సినిమాలో ఆదిత్య ఆది సాయి కుమార్ తో పోటీ పడుతున్నారు.అలాగే వెబ్ ఫిలింలో కూడా ఈయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరోగా దర్శకుడిగా ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న ఆదిత్య ఓం విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో తెలియాల్సి ఉంది.
































