Actor Babloo Prithiviraj: యాక్టర్ బబ్లూ పృథ్వీరాజ్ గురించి గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే 57 సంవత్సరాల వయసులో ఈయన 23 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకోవడంతో పెద్ద ఎత్తున ఈ హీరో గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.ఈ క్రమంలోనే పృధ్విరాజ్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తల పై స్పందించారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ చాలామంది తన పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారని ఈయన తెలియజేశారు. ముసలోడికి తన కూతురు వయసున్న అమ్మాయితో పెళ్లి ఏంటి అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అయితే తన కుటుంబంతో తాను ఎంతో స్ట్రగుల్ అవుతున్న సమయంలో శీతల్ అనుకోకుండా నా జీవితంలోకి వచ్చిందని అప్పుడు నేను ఉన్న పరిస్థితులలో నా బాధను పంచుకోవడానికి ఈమెకు దగ్గరయ్యానని అలా మా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమ పెళ్లి వరకు దారి తీసిందని తెలిపారు.
యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా శీతల్ మాట్లాడుతూ అందరూ అనుకున్నట్టు తాను మలేషియాకు చెందిన అమ్మాయి కాదని తాను ఆంధ్రాకు చెందిన వ్యక్తి అంటూ తెలిపారు.పృద్విని తాను ఒక రోజు రెస్టారెంట్లో కలిశానని ఒక అభిమానిగా తన దగ్గరకు వెళ్లి సెల్ఫీ అడిగాను అలా మా ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకోవడం జరిగిందని ఈమె వెల్లడించారు.

Actor Babloo Prithiviraj: అభిమానిగా అతనికి పరిచయమయ్యాను..
ఈ విధంగా మేమిద్దరం ఒకరి నెంబర్లు ఒకరు మార్చుకొని స్నేహితులుగా మారామని అనంతరం ఆ స్నేహం ప్రేమగా మారిందని ఈమె వెల్లడించారు. ఇక తను నాకు పరిచయమైనప్పుడు నేను ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని శీతల్ ఈ సందర్భంగా పృధ్విరాజ్ తో తనకు ఏర్పడిన ప్రేమ పరిచయం పెళ్లి గురించి ఈమె చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



























