Bhanu chander: సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు భానుచందర్ ఒకరు. ఈయన ఎన్నో అద్భుతమైన ఫీల్ గుడ్ సినిమాలలో నటించారు. అప్పట్లో బాలచందర్ కె విశ్వనాథ్ వంటి ప్రముఖ డైరెక్టర్ల దర్శకత్వంలో నటించిన ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా నటుడుగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న భానుచందర్ తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన రాజమౌళి సినిమాల గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు. తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక ధీరుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమాలో కూడా భానుచందర్ నటించారు. అయితే రాజమౌళి సినిమాల గురించి ఈయన మాట్లాడుతూ నాకు రాజమౌళి చేసే సినిమాలు నచ్చవని తెలిపారు. వీరి దర్శకత్వంలో వచ్చే సినిమాలలో ఎమోషన్ ఎక్కడో తప్పిపోతుంది అందుకే ఆ సినిమాలకు నేను కనెక్ట్ కాలేనని తెలిపారు.
నా కప్ ఆఫ్ టీ కాదు…
ఇలా సినిమాలకు కనెక్ట్ కానప్పుడు ఆ సినిమా తనకు ఎలా నచ్చుతుంది. రాజమౌళి సినిమాలు మాత్రమే కాదు ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ సినిమా కూడా నాకు పెద్దగా నచ్చలేదని తెలిపారు. ఇలాంటి సినిమాలకు నేను అభిమానిని కాను.రాజమౌళి సినిమాలు నా కప్ ఆఫ్ టీ కాదు. కొందరికి కొన్ని చిత్రాలు నచ్చుతాయి.. కొందరికి నచ్చవు.. నాకు రాజమౌళి సినిమాలు నచ్చవు అని ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.



























