Actor Brahmaji: టాలీవుడ్ ప్రేక్షకులకు నటుడు కమెడియన్ బ్రహ్మాజీ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఈయన 1986లో వచ్చిన ‘మన్నెంలో మొనగాడు’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం పలు సినిమాలలో నటిస్తున్న ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఇప్పటికీ పలు సినిమాలలో సహాయ నటుడిగా కొనసాగుతున్నారు.

కెరియర్ పరంగా పలు సినిమాలు చేస్తే ఎంతో బిజీగా ఉన్న బ్రహ్మాజీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో కామెడీ పంచ్ లతో అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయనని ఉద్దేశిస్తూ ఓ నేటిజన్ అంకుల్ అంటూ కామెంట్ చేశారు.ఇలా తనని అంకుల్ అనడంతో రెచ్చిపోయిన బ్రహ్మాజీ అంకుల్ ఏంట్రా అంకుల్ అంకుల్ అంటూ ఏజ్…బాడీ షేమింగ్ చేస్తే కేసు వేస్తా అంటూ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.
ఈ విధంగా బ్రహ్మాజీ తన అభిమానికి సీరియస్ గా కాకుండా సరదాగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బ్రహ్మాజీ చేసిన ఈ కామెంట్ పై మరొక నెటిజన్ స్పందిస్తూ మీరు ఎన్ని కేసులు వేసిన పలానా ఆంటీకి వచ్చినంత అటెన్షన్ మీకు రాదు .. వేసేయండి కేసు వేసేయండి లేదంటే స్వీట్ సిక్స్‌టీన్ బ్రహ్మాజీ గారిని పట్టుకొని అంకుల్ అంటారా.. అంకుల్! అంటూ మరొక నేటిజన్ కామెంట్ చేశారు.

Actor Brahmaji: సరదాగా రియాక్ట్ అయిన బ్రహ్మాజీ…
ఈ విధంగా అంకుల్ అనే కామెంట్ పై బ్రహ్మాజీ ఈ విధంగా రియాక్ట్ కావడంతో ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే బ్రహ్మాజీ తనని అంకుల్ అన్నప్పటికీ ఆయన ఈ విషయాన్ని ఎంతో సరదాగా తీసుకున్నారు అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆంటీ అనే పదం ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో కొందరు నెటిజన్లు బ్రహ్మాజీని ఉద్దేశిస్తూ అంకుల్ అని కామెంట్ చేయడం గమనార్హం.





























