Actor Danush: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ధనుష్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడుగా మాత్రమే కాకుండా.. అటు తమిళ్, ఇటు తెలుగు ఇండస్ట్రీలో కూడా హీరోగా కూడా ధనుష్ కి మంచి క్రేజ్ ఉంది. తమిళ్ భాషలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగిన ధనుష్ ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా తనవైపు తిప్పుకుంటున్నాడు.

ఇప్పటికీ తమిళ ఇండస్ట్రీలో హీరోగా ధనుష్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. ఇక ఇటీవల సార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇదిలా ఉండగా ధనుష్ ప్రస్తుతం ” కెప్టెన్ మిల్లర్ ” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఇటీవల ధనుష్ బ్రేక్ సెషన్‌లో అభిమానులతో ముచ్చటించారు.
ఈ సెషనల్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ధనుష్ ఓపికగా సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలో టాలీవుడ్ ఫేవరెట్ హీరో అనే ప్రశ్నకు ధనుష్ చెప్పిన సమాధానం ఆసక్తికరంగా మారింది. అభిమానులతో బ్రేక్ సెషన్ లో చాట్ చేస్తున్న ధనుష్ ని ” మీకు టాలీవుడ్ హీరోలలో ఎవరంటే ఇష్టం” అని ఒక అభిమాని ప్రశ్నించాడు. దీనికి పవన్ కళ్యాణ్ ఫేవరెట్ హీరో అంటూ ధనుష్ సమాధానం చెప్పాడు.

Actor Danush: పవర్ స్టార్ పవన్ అంటే ఎంతో ఇష్టం…
గతంలో కూడా పవన్ కల్యాణ్ తన ఫేవరెట్ హీరోని ధనుష్ ట్వీట్ చేశాడు. ఇక ఇప్పుడు కూడా టాలీవుడ్ హీరోలలో పవన్ కళ్యాణ్ ఫేవరెట్ హీరో అని చెప్పటంతో ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతే కాకుండా కోలీవుడ్ స్టార్ హీరోకి మన టాలీవుడ్ పవర్ స్టార్ అంటే ఇష్టమని తెలియటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



























