Actor Jogi Naidu : పూరీ జగన్నాథ్ నాకు బంధువు కానీ ఒక్క వేషం ఇవ్వలేదు… పరిచయం లేని సుకుమార్ నాకు వేషాలు ఇచ్చాడు…: జోగి నాయుడు

0
129

Actor Jogi Naidu : అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన జోగి నాయుడు గారు జెమినీ టీవీలో వస్తున్న జోగి బ్రదర్స్ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు డైరెక్టర్స్ తో పనిచేస్తూనే మరోవైపు సినిమాల్లో కమెడియన్గా కూడా చేసారు. ఇక జెమినీ టీవీలో పనిచేస్తున్న సమయంలోనే యాంకర్ ఝాన్సీ గారితో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. ఇక జోగి నాయుడు గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన వ్యక్తిగత జీవితం అలాగే సినిమా ప్రయాణం గురించి పంచుకున్నారు.

ఆ ఒక్క విషయం వల్లే నాకు సినిమా అవకాశాలు రాలేదు…

జోగి నాయుడు గారు సినిమా వాళ్ళతో పరిచయాలుండి నటుడుగా పలు సినిమల్లో మంచి గుర్తింవు అందుకున్నా కూడా ఎక్కువ సినిమాలలో నటించకపోడానికి కారణాలను తెలిపారు. స్టూడియో పెట్టడం వల్ల సినిమాల్లో ఎక్కువ అవకాశాలను వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. మరికొంతమంది డైరెక్టర్లు స్టూడియో ఉపయోగించుకోవడమే కాకుండా సినిమాలో పాత్ర కూడా ఇవ్వాలా అని ఆలోచించిన వాళ్లు ఉన్నారు. అలా కూడా కొన్ని అవకాశాలు రాలేదు. ఇక డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నాకు బంధువు అవుతాడు.

బాగా స్నేహం కూడా ఉంది ఆ చొరవతో అవకాశం అడిగినా మంచి క్యారెక్టర్ ఇస్తాను అన్నాడు, ఇంతవరకు తాను తీసిన సినిమాల్లో ఒక సినిమాలో చేశాను అంతే. అయితే ఏమాత్రం పరిచయం లేని సుకుమార్ మాత్రం నన్ను కొన్ని సినిమాలను మినహాయిస్తే అన్ని సినిమాల్లోనూ పెట్టుకున్నాడు. అలా కొంతమంది జోగి బ్రదర్స్ గా గుర్తు పెట్టుకుని మరీ అవకాశాలు ఇచ్చిన వాళ్ళన్నారు, కొంతమంది స్టూడియో ఉంది వేరే చేసుకుంటున్నాడు ఇక మనం ఎం క్యారెక్టర్ ఇస్తాం అనుకున్నవాళ్ళు ఉన్నారు. అన్ని పక్కన పెట్టి నటన మీద దృష్టి పెట్టుంటే ఇప్పటికి ఒక నాలుగు వందల సినిమాలను చేసుండేవాడిని అంటూ తెలిపారు.