Actor Krishnudu: ఈ మధ్యకాలంలో సామాన్యుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటుగా మారిపోయింది ఇలా తమకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో నటుడుగా సుమారు 40 సినిమాలకు పైగా నటించిన కృష్ణుడు అందరికీ సుపరిచితమే.

ఇలా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించిన కృష్ణుడు వినాయకుడు వంటి సినిమాలో కూడా హీరోగా నటించిన సందడి చేశారు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే అవకాశాలు లేకపోవడం వల్ల ఈయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని తెలుస్తుంది.

Actor Krishnudu: వైరల్ అవుతున్న నిత్య హాఫ్ శారీ ఫొటోస్…
ఇక పోతే చాలాకాలం తర్వాత కృష్ణుడికి సంబంధించిన ఒక వార్త తన ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కృష్ణుడు తన కుమార్తె నిత్య హాఫ్ సారీ ఫంక్షన్ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్ హైదరాబాద్ లోని దస్ పల్లా హోటల్ లో గ్రాండ్ గా నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం కృష్ణుడు కుమార్తె హాఫ్ సారీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

































