Actor Manik Reddy : సునీల్ నేను మంచి ఫ్రెండ్స్… సినిమాల్లో హీరో అయ్యాక ఇంతలా మారిపోతాడని అనుకోలేదు…: నటుడు మాణిక్ రెడ్డి

0
50

Actor Manik Reddy : త్రివిక్రమ్ శ్రీనివాస్, కమెడియన్ సునీల్, నటుడు మాణిక్ రెడ్డి వీరంతా సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుండి మంచి స్నేహితులు. మాణిక్ రెడ్డి గారు సినిమాల్లో మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గాను వివిధ శాఖల్లో పనిచేసినా ‘అలా వైకుంఠపురంలో’ సినిమా ద్వారా నటుడిగా మంచి గుర్తింపు అందుకున్నారు. ఆపైన అరవింద సమేత వీరరాఘవ సినిమాలో ఆకు కావాలా డైలాగ్ తో మంచి స్టార్ డమ్ అందుకుని ప్రస్తుతం నేను స్టూడెంట్ సార్ సినిమాలో మంచి క్యారెక్టర్ తో ఆకట్టుకున్న మాణిక్ రెడ్డి గారు తన కెరీర్ గురించి ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

సునీల్ చాలా మారిపోయాడు…

త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సలహా మేరకు సినిమాల్లో నటుడుగా మారిన మాణిక్ గారు అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా స్కోప్ ఉన్న పాత్రలేవి రాలేదట. అయితే అలా వైకుంఠపురంలో సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఆయన అరవింద సమేత సినిమాతో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం స్ట్రగల్ అవుతున్న సమయంలోనే సునీల్ త్రివిక్రమ్ మంచి స్నేహితులని చెప్పిన ఆయన సునీల్ ఇపుడు చాలా మారిపోయాడంటూ చెబుతారు.

స్టార్ డమ్ వచ్చాక తనతో అరుదుగా మాట్లాడుతుంటానని అయితే త్రివిక్రమ్ ఎపుడూ తనతో మాట్లాడుతూ టచ్ లో ఉండాలని చెబుతూంటాడు అయితే నేను ఎక్కువగా మాట్లాడటం, కలవడం చేయలేదు. సునీల్ ఇపుడు మాట్లాడే ఇంటర్వ్యూలను కొన్ని వీడియోలను చూసాక తనలో ఎంత మార్పు వచ్చింది అనిపిస్తుంది. తన మాటలు యువతకి ఆదర్శనంగా ఉంటున్నాయి. మొన్నామధ్య ఫోన్ లో తనతో మాట్లాడినపుడు అదే చెప్పాను. తను నన్ను తమ్ముడు అని పిలుస్తాడు. చాలా మంచి మాటలను ఇప్పటి తరానికి చెబుతున్నారని అనిపిస్తుంది అంటూ మాణిక్ రెడ్డి తెలిపారు.