తెలుగమ్మాయి కదా అని సిరికి చాన్స్ ఇస్తే.. ఇలా చేసింది: నందకిషోర్.. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు హీరోయిన్లతా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. తెలుగులో కూడా మంచి మంచి యాక్టర్లు ఉన్నారు. గ్లామర్ కు ఏ మాత్రం తీసిపోని వాళ్లు కూడా ఉన్నారు. అయినా పొరుగు రాష్ట్రాల నుంచే పిలిపించుకోవడానికి కారణం ఏంటో అర్థం కాదు. ఈ విషయంపై మొదటి నుంచి కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి.

ఈ విషయంపై నందకిశోర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తెలుగు హీరోయిన్లను సినమాలో తీసుకుంటే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయట. ఈ విషయంలో నాకు అనుభవం ఏర్పడిందన్నారు. సిరి హన్మంత్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆమె ‘నరసింహపురం’ సినిమాలో నందకిశోర్, సిరి హీరోహీరోయిన్లుగా చేశారు.
ఈ ఏడాది రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆమెను ప్రమోషన్స్‌కు పిలిచినప్పుడు తాను రాలేను అంటూ చెప్పిందన్నారు నంద కిశోర్. ట్రైలర్ లో తన పాత్ర అసభ్యకరంగా ఉందని.. అది చూసిన వారికి తనపై నెగెటివ్ ఫీలింగ్ వస్తుందని.. అందుకే రాను అంటూ చెప్పిందన్నారు.
దానికి, ప్రమోషన్స్‌కు రాకపోవడానికి సంబంధం ఏంటో నాకర్థం కాలేదన్నారు. అయితే తన పాత్రను ముందు ఒకలా.. తర్వాత మరోలా తీర్చిదిద్దారనే ఫీలింగ్ లో ఉందన్నారు. ఈ సినిమాలో ఆమె పాత్రను అద్బుతంగా తీర్చిదిద్దారని.. ఆమె ఇప్పటికీ ఆ సినిమా చూసి ఉండదు అంటూ చెప్పాడు. తెలుగు అమ్మాయికి ఒక్కసారి చాన్స్ ఇస్తే.. ఇలా జరిగిందని చెప్పుకొచ్చాడు.


























