Actor Nani :నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు దర్శకత్వంలో దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా మార్చి 30 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రబృందం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోని ఈ సినిమా నుంచి ఓరి వారి అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు.

ఇక ఈ పాట లాంచింగ్ కార్యక్రమంలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నలకు నాని సమాధానం చెప్పారు. అయితే ఈ సినిమాలో నాని డీ గ్లామర్ లుక్ లోకనిపించడంతో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్ లాగే ఉందని పలువురు నానీ లుక్ విషయంలో ట్రోల్ చేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన నాని ఏడాదికి సుమారు నాలుగు ఐదు వందల సినిమాలు వస్తాయి.అందులో హీరోలందరూ కూడా ప్యాంటు చొక్కా వేసుకున్నారు. అయితే వాళ్ల లాగే నేను కూడా ప్యాంటు చొక్కా వేసుకున్నాను అని పోల్చడం సరికాదంటూ తెలిపారు.
అనంతరం మరొకరు దసరాని ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ల రేంజ్ సినిమా అని ఎలా పోల్చగలిగారు? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ.. ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. తాను ఆర్ఆర్ఆర్ కేజిఎఫ్ సినిమాలతో పోల్చాను అంటే ఈ సినిమాల రేంజ్ లో మా సినిమా బడ్జెట్ 500,1000 ఖర్చు చేయలేదని అలాగే ఇండస్ట్రీ గర్వించదగ్గ ఆ సినిమాలు మాదిరిగానే, ఆ సినిమాలలో సన్నివేశాలు మాదిరిగా మా సినిమా ఉంటుందని నేను చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు.

Actor Nani : ట్రోల్స్ పై క్లారిటీ ఇచ్చిన నాని..
ప్రతి ఏడాది ఒక్కో చిత్ర పరిశ్రమ నుంచి విడుదలైనటువంటి కొన్ని సినిమాలు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణంగా మారుతాయి. ఇలా గత ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి RRRఎంతో గర్వించబడగా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కేజిఎఫ్ సినిమా అంతే గర్వకారణంగా నిలిచాయి. అయితే ఈ ఏడాది ఈ సినిమాల మాదిరిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మా సినిమా గర్వించదగ్గ సినిమాగా నిలిచిపోతుందని చెప్పాను అంటూ తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
































