Actor Nani: సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉందంటూ పలువురు పెద్ద ఎత్తున నేపొకిడ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.ఇలా వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని, బయట వారికి అవకాశాలు లేకుండా చేస్తున్నారంటూ ఎంతోమంది ఈ నెపోటిజం పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక ఈ వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ.. నెపోటిజం కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతి ఒక రంగంలోనూ ఉందని డాక్టర్ కొడుకు డాక్టర్ అయినప్పుడు ఒక లాయర్ కొడుకు లాయర్ అయినప్పుడు హీరో కొడుకు హీరో అయితే తప్పేంటి అని ప్రశ్నించారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ నెపోటిజం గురించి నాచురల్ స్టార్ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాని ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. దీంతో ఈయన నేపోటిజం గురించి మాట్లాడటంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..నాని హీరో రానాతో కలిసి నిజం విత్ స్మిత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన నేపోటిజం గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఇండస్ట్రీలో నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నది మరెవరో కాదు ప్రేక్షకులేనని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Actor Nani: రామ్ చరణ్ సినిమాను కోటి మంది చూస్తారు..
సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాని కోటి మంది ప్రేక్షకులు చూస్తారు. అదే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన తన సినిమాని మాత్రం లక్షమందే చూస్తారు. ఇక్కడ ఎవరు నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అంటూ ఈయన ప్రశ్నించారు. ఇలా నెపోటిజం గురించి నాని చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
































