Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ విధంగా ఈయన పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఈయనకు సినీ సెలబ్రిటీల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ తరుణంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు ఈయనకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మద్దతు తెలియజేస్తున్నారు.

ఇప్పటికే మెగా హీరోలతో పాటు జబర్దస్త్ కమెడియన్లు మొత్తం పిఠాపురంకి వెళ్లి ప్రచార కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పలువురు నిర్మాతలు దర్శకులు కూడా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడిని గెలిపించాలి అంటూ వీడియోని షేర్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక రామ్ చరణ్ సైతం తన బాబాయి గెలుపుకు కృషి చేయాలని ట్వీట్ చేశారు. ఇక సినీ నటుడు నాని సైతం పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు. ఇలా సెలబ్రిటీలు అందరూ కూడా పవన్ గెలుపును ఆకాంక్షిస్తున్నారు. తాజాగా నటుడు నరేష్ సైతం సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గెలుపును కోరుతూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
నాయకత్వం నాకు ఆదర్శం..
డియర్ పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీకి నేను ప్రారంభం నుంచి మద్దతు దారుడిగా ఉన్నాను. నీ నాయకత్వం నాకు ఆదర్శం. నీ జర్నీ ప్రజలకు ఒక ఆశాకిరణం లాంటిది. నువ్వు చేపట్టిన ఈ మిషన్ లో నీకు మా అందరి మద్దతు ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో నీ పార్టీ ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ ఈయన చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.





























