Naveen Chandra: అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటుడు నవీన్ చంద్ర. సినిమాలలో హీరోగా నటించిన ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇటీవల ఇన్‌పెక్టర్ రిషి అనే వెబ్ సిరీస్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న నవీన్ ఒక ఇంటర్వ్యూలో ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తాను హీరో అయ్యేందుకు వర్షం సినిమానే ప్రధాన కారణమంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ త్రిష హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వర్షం సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే ఈ సినిమా 50 డేస్ సెలబ్రేషన్స్ భీమవరంలో జరిగాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా నేను నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే పాటకు అచ్చం ప్రభాస్ లాగా గెటప్ వేసుకొని వేదికపై డాన్స్ చేశాను. ఈ కార్యక్రమానికి సుమారు ఆరు లక్షల మంది వరకు అభిమానులు వచ్చారు వారందరినీ చూసి నేను షాక్ అయ్యాను సినిమా హీరో అయితే ఇంతగా అభిమానం ఉంటుందా అని భావించి నేను కూడా హీరో కావాలని ఫిక్స్ అయ్యాను అంటూ నవీన్ చంద్ర తెలిపారు..
వర్షం సినిమానే కారణం..
ఇలా వర్షం సినిమా 50 డేస్ సెలబ్రేషన్స్ నన్ను హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది అంటూ నవీన్ చంద్ర చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .ఇక తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో రోజుకు 50 రూపాయలు లేదా ₹100 రెమ్యూనరేషన్ తీసుకుంటూ పని చేశానని కూడా ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు.



























