Actor Prabhu: తమిళ చిత్ర పరిశ్రమలోకి నటుడు తిలకం శివాజీ గణేశన్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ప్రభు.. బాలనటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1982లో తన తండ్రి శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన షంగిలి చిత్రంలో హీరోగా కనిపించారు. ఇలా హీరోగా పలు సినిమాలలో నటించిన ఈయన అనంతరం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభు తాజాగా తీవ్ర అస్వస్థతకు గురై చెన్నైలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్టు తెలుస్తోంది.ఇలా ఈయన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలయ్యారని తెలియగానే అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధి సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన ఉన్నఫలంగా అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది.
ఇక చెన్నైలోనే ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలో రాళ్లను తొలగించామని..ప్రస్తుతం ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.ఇక ప్రస్తుతం ఈయన కోరుకుంటున్నారని మరో రెండు రోజులపాటు ఆసుపత్రిలో అబ్జర్వేషన్ లో ఉంచిన తరువాత తనని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలియజేశారు.

Actor Prabhu: కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ప్రభు…
ఈ విధంగా నటుడు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారని తెలియగానే అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈయనకు ఎలాంటి ప్రమాదం లేదని తెలియగానే ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈయన తెలుగులో చంద్రముఖి డార్లింగ్ వంటి సినిమాలలో నటించి మెప్పించారు. చివరిగా విజయ్ దళపతి హీరోగా నటించిన వారసుడు సినిమాలో నటించారు.































